Header Banner

మరింత బలపడిన వాయుగండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన.! ఆ ప్రాంతాల వారు అప్రమత్తం!

  Fri May 23, 2025 14:51        Environment

రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు మూడు రోజుల్లోల కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని ప్రకటించింది. రుతుపవనాల రాకకు అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొంది. రుతుపవనాలు రాక ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అరేబియా సముద్రానికి ఆనుకొని ఏర్పడిన అల్పపీడనంతో రెండు రాష్ట్రాల్లో వర్షావరణం ఏర్పడింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.ఇప్పుడు బంగాళాఖాతంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడనుంది. వచ్చే వారం మొదట్లో అంటే 26-27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ అల్పపీడనం ఏర్పడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్‌లో రెండు రోజులు, తెలంగాణలో నాలుగు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఈ సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని చెబుతున్నారు. ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది తుపానుగా మారితే గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం.. వేసవి రద్దీ నేపథ్యంలో..

 

దీని కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం మారుతూ ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.  తెలంగాణలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మూడు రోజుల నుంచి వానలు కుమ్మేస్తున్నాయి. శుక్రువారం కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అత్యధిక ఉష్ణోగ్రత 35.5 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత మెదక్‌లో 20.3 డిగ్రీలుగా నమోదు అయింది. చాలా ప్రాంతాల్లో ఈ సీజన్‌లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు కంటే దాదాపు పది డిగ్రీల తక్కువ నమోదు అయ్యాయి. మరికొన్ని రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణాజిల్లాల్లో చెదుమదురు వర్షాలు పడొచ్చు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయి. పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.   

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather